![]() |
![]() |

ఈ మధ్య కాలంలో హడావిడి చేస్తున్న షో రొమాంటిక్ టాక్స్ నడుస్తున్న షో ఒక మోస్తరుగా లేడీ ఓరియెంటెడ్ షోగా నడుస్తోంది కాకమ్మ కథలు. ఇప్పుడు సీజన్ 3 నడుస్తోంది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి మౌనీషా చౌదరి, నైనికా ఆనసుర గెస్టులుగా వచ్చారు. ఇందులో ఫస్ట్ రౌండ్ పేరు "ఆశకు హద్దుండాలి". ఈ రౌండ్ ఫుల్ రొమాంటిక్ టాక్స్ తో నిండి ఉంటుంది. అది కూడా కొన్ని వర్డ్స్ ని ఒక పిక్చర్ ని పిక్ చేసుకుని రెండిటిని కలిపి చెప్పాలి. ఇక మౌనీషా చౌదరి ఇంకా రొమాంటిక్ గా చెప్పింది. సందీప్ కిషన్ పిక్ వచ్చింది ఆమెకు.
"వన్ నైట్ ధడేల్... అని స్నో పడిందన్న మాట" అని మౌనీషా అనేసరికి తేజస్విని, నైనిన పగలబడి నవ్వేశారు. "ఎవరు లేరా ఇక్కడ నన్ను రక్షించడానికి అని నేనక్కడ బాధపడతా అరుస్తా ఉంటే అలా సందీప్ కిషన్ గారు నడుచుకుంటూ వచ్చారు. నీ హెయిర్ స్టైల్ అంతా పాడైపోతుంది స్నో లో...ఆ పక్కనే గడ్డివాము ఉంది అక్కడికి రా" అన్నారని చెప్పింది. దాంతో తేజు "ఇంకేం ఉన్నాయి తెలుసా " అని అడిగింది. "రౌండ్స్ " అంది మౌనీషా. "మీరనుకున్న రౌండ్ లు కాదు " అని మళ్ళీ క్లారిటీ ఇచ్చింది మౌనీషా. "మేమేం అనుకోలేదు" అని పడీపడీ నవ్వారు. "మీ బుర్రలు నాకు తెలుసురా అవి బూతు బుర్రలని. కెమెరాలు ఆపేయండి అసలు ఒరిజినల్ స్టోరీ చెప్తా" అంది మౌనీషా.
తరువాత నైనికా వంతొచ్చింది. సిద్దు జొన్నలగడ్డ ఫోటో వచ్చింది. "ఏయ్ సిగ్గుపడింది కాదు సిద్దుపడింది" అంది తేజస్విని. "డీజే టిల్లు చూసి వచ్చా" అంది నైనికా. "ఒకరోజు మంచు కొండలు వాటిల్లో సెటప్ చేసి మా రా ఇక్కడ భూమ్ భూమ్ చేసి రీల్ చేద్దాం ఇక్కడ " ఇది స్టోరీ అంది. అందులో ఎలాంటి రొమాంటిక్ స్టోరీ లేకపోయేసరికి "ఏ ఛీ ఆపండి " అంది తేజు. "మంచు కొండలకు తీసుకెళ్లి మరీ పాడు చేయాలా ఏంటి " అనేసరికి నైనికా, మౌనీషా తెగ నవ్వేశారు. ఇక ఈ ప్రోమో కింద ఒక నెటిజన్ ఐతే "డబుల్ మీనింగ్ జోక్స్ తప్ప ఇంకేం లేదు " అని కామెంట్ పెట్టారు.
![]() |
![]() |